: దినకరన్ అభ్యర్థనను తోచిపుచ్చిన ఢిల్లీ పోలీసులు.. నేడు విచారణకు హాజరు
అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండాకుల’ కోసం ముడుపుల కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మూడు రోజుల గడువు కావాలన్న దినకరన్ అభ్యర్థనను ఢిల్లీ పోలీసులు తోచిపుచ్చారు. దీంతో ఆయన నేడు (శనివారం) ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో పార్టీ చిహ్నమైన రెండాకులను నిలుపుకునేందుకు అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బ్రోకర్ సుఖేశ్ చంద్ర ద్వారా ఎన్నికల అధికారులకు రూ.50 కోట్లు ముడుపులు చెల్లించేందుకు సిద్ధమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో సుఖేశ్ చంద్ర రూ.1.30 కోట్లతో పట్టుబడ్డాడు. ఆ సొమ్ము దినకరన్ ఇచ్చిందేనని, రెండాకుల గుర్తును నిలుపుకునేందుకు ఎన్నికల అధికారులకు చెల్లించేందుకు దినకరనే ఈ సొమ్ము ఇచ్చినట్టు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినకరన్‌కు సమన్లు జారీ చేశారు. 22న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. అయితే తనకు 25 వరకు గడువు కావాలని దినకరన్ అభ్యర్థించారు. ఆయన వినతిని తిరస్కరించిన పోలీసులు 22న విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో నేడు ఆయన ఢిల్లీలో పోలీసుల ఎదుట హాజరుకానున్నారు.