: ఐపీఎల్-10: 17 బంతుల్లో 42 పరుగులు చేసిన నరైన్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా-గుజరాత్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు నరైన్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. గుజరాత్‌ బౌలర్లపై విరుచుకుప‌డుతూ 17 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేశాడు. దీంతో కోల్ కతా చేసిన తొలి 45 పరుగుల్లో 42 పరుగులు నరైన్ వే ఉన్నాయి. స‌రైన్ విజృంభణ‌తో కోల్ కతా ఆట‌గాళ్లు హుషారుగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన‌ కోల్ కతాకు తొలుత బ్యాటింగ్ చేసే అవ‌కాశం ల‌భించింది. దీంతో గౌతం గంభీర్ తో కలిసి నరైన్‌ ఓపెనర్ గా క్రీజులోకి వ‌చ్చాడు.

  • Loading...

More Telugu News