: మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 15 మంది మృతి
రేషన్ దుకాణంలో మంటలు చెలరేగి 15 మంది మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా బర్గి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. రేషన్ దుకాణంలో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయని, అక్కడ కిరోసిన్ ఉండటంతో పెద్ద ఎత్తున వ్యాపించాయని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.