: 'రానా చాలా ఫ్యాషనబుల్' అంటూ మిల్కీ బ్యూటీ కితాబు


దగ్గుబాటి రానాకు మిల్కీబ్యూటీ తమన్నా కితాబిచ్చింది. రానా చాలా ఫ్యాషనేబుల్ గా ఉంటాడని, బెస్ట్ డ్రెస్ ధరించే వారిలో దేశంలోనే రానా ఒకడంటూ తమన్నా ప్రశంసించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ, రానా దుస్తులు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయని, ఫ్యాషన్ గా ఉండటాన్ని తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. కాగా, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బాహుబలి-2’ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News