: సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు: సీఎం చంద్రబాబు
సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అభ్యంతరకర పోస్టులు, అసత్య ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... సామాజిక మాధ్యమాలను ఎంతో మంది దుర్వినియోగం చేస్తున్నారని, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిల్లో కొందరు ఏదైనా రాయొచ్చని అనుకుంటున్నారని, దేనికైనా ఒక పద్ధతి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.