: ఇతని వయసు 324 ఏళ్లు?: బాలీవుడ్ సినిమాలోని వెరైటీ పాత్ర
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వయసు 324 సంవత్సరాలు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరనుకున్నారు? బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ (32) సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘రాబ్తా’ సినిమా కోసం రాజ్ కుమార్ రావ్ ను 324 ఏళ్ల వృద్ధుడిలా మార్చేశారు. ఈ పాత్ర పోషించే నటుడి కోసం 16 మందికి స్క్రీన్ టెస్టు నిర్వహించగా రాజ్ కుమార్ రావ్ ను ఫైనల్ చేశారు. రోజూ ఆరుగంటల సమయం కేవలం మేకప్ కోసమే పడుతుండగా, ఈ పాత్రకు మేకప్ కోసం లాస్ ఏంజెల్స్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'మగధీర' సినిమాను గుర్తుకు తేవడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను చెప్పకుండా నిర్మాతలు సీక్రసీని మెయింటైన్ చేస్తున్నారు.