: ముందస్తు ఎన్నికలు రావచ్చు: చంద్రబాబు నోట సంచలన మాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ఈ ఉదయం ఆయన అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగగా, వైకాపా నుంచి వచ్చిన నేతలతో కలసి పనిచేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తోందని గుర్తు చేసిన ఆయన, అందులో భాగంగా ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలిపారు. పార్టీలోని నేతలందరూ కలసికట్టుగా సాగితే మరోసారి విజయం ఖాయమని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.