: ‘చిన్నమ్మ’ త్యాగమూర్తి.. జయలలిత వీడియోను బయటపెడతా: జయానంద్
తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతుండడంపై శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ స్పందించారు. చిన్నమ్మ శశికళ త్యాగమూర్తి అని, ఆమెపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శశికళతో ఆమె మాట్లాడిన వీడియోను బయటపెడతానని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. తనపై హత్యారోపణలు వచ్చినా శశికళ మౌనంగా ఉన్నారని, జయలలిత చికిత్స పొందిన ఫొటోలను బయటపెట్టలేదని అన్నారు. పచ్చగౌనులో ఉన్న జయను శత్రువులు చూడకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా చేశారని వివరించారు. ఇది ఓ త్యాగమూర్తి చేసిన పని అంటూ శశికళను కొనియాడారు.
స్వర్గలోకాన్ని పాలించేందుకు సింహాన్ని సింహంలానే రాచమర్యాదలతో పంపించామని జయానంద్ పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిదని, ఏదో ఒక రోజు అది బయటపడుతుందని, శశికళ-జయ మధ్య జరిగిన సంభాషణలు బయటకొస్తే పీహెచ్ పాండ్యన్, మనోజ్ పాండ్యన్, పన్నీర్ సెల్వం లాంటి వారిని ఏం చేయాల్సి వస్తుందోనని తన ఫేస్బుక్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌ను ఆయన ఈనెల 7న చేసినట్టు తెలుస్తోంది.