: ఎట్టకేలకు శివసేన ఎంపీ గైక్వాడ్ విమానమెక్కారు!


విమానయాన సంస్థలు తనపై నిషేధం ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానమెక్కారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఈ రోజు ఆయన ప్రయాణించారు. కాగా, ఎయిర్ ఇండియా ఉద్యోగిపై అవమానకర రీతిలో ప్రవర్తించిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన సంస్థలు నిషేధం ప్రకటించడం, ఆపై ఎత్తివేయడం తెలిసిందే. అయితే, తనపై నిషేధం ఎత్తి వేసినప్పటికీ, పుణె నుంచి ఢిల్లీకి రైలులో ఇటీవల ఆయన ప్రయాణించారు. అంతేకాదు, అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కూడా రైల్లోనే చేశారు. 

  • Loading...

More Telugu News