: సీఎం కేసీఆర్ ఆదేశాలను లెక్కచేయని ప్రైవేటు పాఠశాలలు!


రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ రోజు నుంచి పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే, సీఎం ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు బేఖాతర్ చేశాయి. ఈ రోజు యథాతథంగా ఆయా పాఠశాలలను యాజమాన్యాలు నడిపించాయి. హైదరాబాద్ ఇబ్రహీం బాగ్ లోని భాష్యం బ్లూమ్స్, అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత, నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, యూసుఫ్ గూడలోని బడ్స్ అండ్ ఫ్లవర్స్ హైస్కూల్, ఇండియన్ బ్లూమ్స్, సెయింట్ పాల్స్  హై స్కూల్స్, ఎస్జీబీ హైస్కూల్, భారత భారతి స్కూల్ తదితర పాఠశాలలు ఈ రోజు క్లాసులు నిర్వహించినట్టు సమాచారం. అయితే, ఎండలు మండిపోతుంటే విద్యార్థుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయంటూ   పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News