: జైలు నుంచి శశికళే ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్న అనుమానం ఉంది: పన్నీర్ వర్గం నేత మునుస్వామి కొత్త ట్విస్ట్
తమిళనాడులో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం విలీనం దిశగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పన్నీర్ వర్గానికి చెందిన కీలక నేత కేపీ మునుస్వామి ఈ రోజు పలు వ్యాఖ్యలు చేశారు. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి అధికారంగా బహిష్కరిస్తేనే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల విలీనం జరుగుతుందని ఆయన అన్నారు. పళనిస్వామి వర్గం నేతల వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు జైలులో ఉన్న శశికళయే ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో విలీనం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. అలాగే జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.