: పూణె జట్టుకు షాక్... ఐపీఎల్ కు దూరమవుతున్న కెప్టెన్ స్టీవ్ స్మిత్
ఐపీఎల్-10వ సీజన్లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కు షాక్ తగిలింది. జట్టు సారథి స్టీవ్ స్మిత్ కొన్ని రోజుల పాటు దూరంకానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా వెల్లడించాడు. కుటుంబసభ్యులతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నట్టు తెలిపాడు. ఐపీఎల్ కు ముందు టీమిండియాతో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఆసీస్ జట్టు భారత్ కు వచ్చింది. సిరీస్ పూర్తయిన వెంటనే ఐపీఎల్ ప్రారంభమైంది. దీంతో, ఆసీస్ ఆటగాళ్లు తమ కుటుంబాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే, స్మిత్ ఫ్యామిలీతో గడిపేందుకు దుబాయ్ వెళుతున్నాడు. ఆరు రోజుల పాటు ఐపీఎల్ కు దూరమవుతున్నట్టు స్మిత్ చెప్పాడు. దీంతో, రెండు మ్యాచ్ లకు స్మిత్ దూరం కానున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్ లో 5 మ్యాచ్ లు ఆడిన పూణె జట్టు కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో స్థానంలో ఉంది.