: దినకరన్ ఇంటి వద్ద అర్ధరాత్రి హై డ్రామా!


బుధవారం అర్థరాత్రి 12 గంటలకు కొన్ని నిమిషాల ముందు... అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ ఇంటివద్దకు ఢిల్లీ పోలీసుల బృందం వచ్చింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్ కు లంచం ఆఫర్ చేసిన కేసులో శనివారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. విశ్వసనీయ సమాచారంతో దినకరన్ కు, ఈసీకి మధ్య బ్రోకర్ గా వ్యవహరించిన సుకాష్ చంద్రశేఖరన్ (27)ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే.  అతనిచ్చిన సమాచారం దినకరన్ కు వ్యతిరేకంగా ఉండటంతోనే ఆయన్నూ విచారించాలని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఇక నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బృందం దినకరన్ ఇంటికి వచ్చిన సమయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. వారిని అడ్డుకునేందుకు ఆయన అనుచరులు ప్రయత్నించారు. ఈ సమయంలో శశికళ వీరాభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఆ వెంటనే స్పందించిన పోలీసులు అతని ప్రయత్నాన్ని విఫలం చేశారు. దినకరన్ ఇంటి ముందు పోగైన కార్యకర్తలను చెదరగొట్టగా, ఆపై ఢిల్లీ పోలీసులు ఆయన ఇంట్లోకి వెళ్లి నోటీసులు అందించారు.

  • Loading...

More Telugu News