: కారు సహా భార్య సజీవ దహనం...భర్తపైనే అనుమానం


విశాఖపట్టణం జిల్లా ఎస్‌.రాయవరం మండలంలోని అడ్డరోడ్డు జంక్షన్‌ సమీపంలో ఓ కారు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. హైవేపై నిలిపి ఉన్న స్కార్పియో కారు నుంచి మంటలు అకస్మాత్తుగా వ్యాపించడంతో, క్షణాల్లో కారును చుట్టుముట్టాయి. దీంతో కారులోని మహిళ సజీవదహనమైంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, భర్త పాత్రపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News