: సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలి: సీఎం చంద్రబాబు ఆదేశాలు
కృష్ణా నదిలోని సప్త ద్వీపాలను స్వాధీనం చేసుకుని, ఆపై అభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ రాజధాని నిర్మాణంపై ఆయా శాఖల అధికారులతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే రహదారులపై హోర్డింగుల ఏర్పాటుపై ఓ ప్రణాళిక ఉండాలన్నారు. రోడ్ల మధ్యలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.