: పేదల మధ్యే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు: కాల్వ శ్రీనివాసులు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు తన పుట్టినరోజు వేడుకలను పేదల మధ్యే జరుపుకుంటారని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రేపు చంద్రబాబు 67వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. కాగా, అనంతపురం జిల్లాలో రేపు ఆయన పర్యటనకు వెళుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన శిల్పారామాన్ని రేపు ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలిసి కాల్వ శ్రీనివాసులు వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు పేదల మధ్యే జరుగుతాయని చెప్పారు. ‘అనంత’లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.