: భూమి, ఆకాశం ఒక్కటి కాదు..మతపర రిజర్వేషన్లు అమలు కావు : కిషన్ రెడ్డి
కాకి లెక్కలతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని చూస్తున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మాకు మత పిచ్చి లేదు. రాజ్యాంగాన్ని గౌరవించాలనే పిచ్చి మాది. బీజేపీకి మత పిచ్చి అనడం సరికాదు. భూమి, ఆకాశం ఒక్కటి కాదు..మతపర రిజర్వేషన్లు అమలు కావు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడుతాం. కాకి లెక్కలతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు? వారసత్వ ఉద్యోగాలపై సీఎస్, సింగరేణీ సీఎండీలను కలుస్తాం’ అని కిషన్ రెడ్డి చెప్పారు.