: చంద్రబాబు ప్రయాణించే దారి మారింది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా నదీ తీరంలోని లింగమనేని ఎస్టేట్స్ లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన నివాసం నుంచి అమరావతిలోని సచివాలయానికి వెళ్లే రూటును అధికారులు మార్చారు. కరకట్ట విస్తరణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకుంటారు.