: హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం...బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్
హైదరాబాదులోని అవుటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అవుటర్ రింగురోడ్డుపై బెంగళూరు నుంచి హైదరాబాదు వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు భారీ లారీని ఢీ కొట్టింది. దీంతో ఆ లారీ బోల్తా పడగా, ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఇరుక్కుపోగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రాధమికంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, లారీని ఢీ కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.