: రజనీకాంత్‌ నటుడు మాత్రమే.. రాజకీయాల గురించి తెలియదు: సుబ్రహ్మణ్య స్వామి


ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడులోని కలవై గ్రామంలో ఈ రోజు ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ర‌జ‌నీ నటుడు మాత్రమేనని, రాజకీయ నాయకుడు కాదని అన్నారు. తమిళనాడులో రాజకీయ నాయకులు గొప్ప నటులని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. భార‌త‌ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితుల గురించి సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మాట్లాడుతూ... ఆ కేసులో ఏడుగురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యే అవకాశమే లేదని అన్నారు.

  • Loading...

More Telugu News