: బ్రిటన్ లో ముందస్తు ఎన్నికలు.. ప్రధాని ప్రకటన
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగిన తర్వాత అన్ని అంశాల్లోనూ బ్రిటన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో పొలిటికల్ యూనిటీ కావాలని పేర్కొంటూ బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ముందస్తు ఎన్నికలకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన చేశారు. ఇందు కోసం నిర్వహించిన ఓ సమావేశంలో తమ ప్రభుత్వంలోని సభ్యులందరూ ముందస్తు ఎన్నికలకు అంగీకరించారని ఆమె తెలిపారు.