: ఎయిర్ ఏసియా టిక్కెట్లపై రిలయన్స్ జియో డిస్కౌంట్ ఆఫర్!


త‌మ వినియోగ‌దారుల‌కు ఎయిర్ ఏసియా టిక్కెట్లపై 15 శాతం వరకు డిస్కౌంట్ ను అందించేందుకు రియ‌ల‌న్స్ జియో నిర్ణ‌యం తీసుకుంది. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ చేసిన ఓ రిపోర్టు ప్ర‌కారం.. ఎయిర్ ఏసియా మొబైల్ యాప్ ద్వారా జియో ఈ ఆఫర్‌ను త‌మ‌ వినియోగదారులకు అందించ‌డానికి సిద్ధ‌మైంది. ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 30 వరకున్న ప్రయాణ సమయాల్లో జియో యూజ‌ర్లు ఈ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్ బుకింగ్‌ల‌ను రెండు, మూడు రోజుల్లో లాంచ్ చేయబోతోంది. ప్రత్యర్థి కంపెనీల అత్యధిక ఏఆర్పీయూ (ఒక్కో యూజరుపై ఆర్జించే కనీస రెవెన్యూ) యూజర్లను ల‌క్ష్యంగా చేసుకుని వారిని ఆక‌ర్షించ‌డానికి రిల‌య‌న్స్‌ జియో ఈ ఆఫ‌ర్‌ను అమ‌ల్లోకి తీసుకురానుంది.

  • Loading...

More Telugu News