: శశికళపై నిప్పులు చెరిగిన పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిప్పులు చెరిగారు. అమ్మ జయలలితను శశికళ మోసం చేశారని... అమ్మను మోసం చేసిన వారు ఎవరైనా సరే వెళ్లిపోవాల్సిందే అని అన్నారు. జయలలిత బతికున్న రోజుల్లో శశికళ టీమ్ మొత్తాన్ని దూరంగా పెట్టారని చెప్పారు. అమ్మ మృతిపై న్యాయ విచారణ జరిపించాలనేదే తన మొదటి డిమాండ్ అని చెప్పారు. చికిత్స సమయంలో ఆసుపత్రిలో ఏం జరిగిందో బయటకు రావాల్సిందేనని అన్నారు. శశికళ, దినకరన్ లను పార్టీ పదవుల నుంచి తొలగించాలని చెప్పారు.
తమిళ ప్రజలకు సేవ చేసే క్రమంలో... జయ చూపిన బాటలో నడుస్తామని పన్నీర్ సెల్వం అన్నారు. మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీరిద్దరూ చేతులు కలిపి, మన్నార్ గుడి మాఫియాను పార్టీ నుంచి గెంటేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.