: జీవితానికి ఈ మూడూ చాలా ముఖ్యమైనవంటున్న సినీ నటి కాజల్
ప్రతిమనిషి జీవితంలోనూ చాలా ముఖ్యమైన మూడు విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ చెబుతోంది. ప్రతి వ్యక్తి ఎమోషన్స్, రిలేషన్స్, ఫ్యామిలీకి ప్రాముఖ్యతనివ్వాలని కాజల్ సూచిస్తోంది. ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కవిషయాన్ని పట్టించుకోకపోయినా వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాజల్ అభిప్రాయపడుతోంది. తనవరకు అయితే ఈ మూడు విషయాలను సమన్వయం చేసుకుంటానని తెలిపింది. ఎక్కడికి వెళ్లినా కుటుంబ బాధ్యతలు గుర్తుంచుకుంటానని తెలిపింది. అలాగే తన తల్లి తనవెంట ఉండేలా చూసుకుంటానని చెప్పింది. అలాగే తన చెల్లెలి దగ్గరకు తాను వెళ్లడమో లేక తన చెల్లెలిని రమ్మని పిలవడమో జరుగుతుందని, దీంతో హోమ్ సిక్ అన్నదే తనకు తెలియదని కాజల్ చెబుతోంది.