: జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ.. కలకలం రేపుతున్న లేఖ
2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు తన దృష్టంతా సినిమాలపైనే ఫోకస్ చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో, ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే... తారక్ కొత్త పార్టీ పెట్టాడనేది. జూనియర్ ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఓ పార్టీ రిజిష్టర్ అయిందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆ పార్టీ పేరు 'నవ భారత్ నేషనల్ పార్టీ'. తారక్ ను ఈ పార్టీ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు ఆ పార్టీ లెటర్ హెడ్ మీద టైప్ చేసిన లెటర్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే, ఇది కావాలనే ఎవరో సృష్టించిన లేఖ అని కొందరు చెబుతున్నారు. ఈ వార్తలపై జూనియర్ కూడా ఇంకా స్పందించలేదు.