: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. ఈ మధ్యకాలంలో జాత్యహంకార దాడులు, కాల్పులతో అమెరికా దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈశాన్య కొలంబస్ లోని ఓ క్లబ్ దగ్గర దుండగుడు కాల్పులతో హోరెత్తించాడు. దీంతో 9 మందికి తీవ్రగాయాలయ్యాయని ప్రాధమికంగా తెలుస్తోంది. ఓ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే దాడులకు పాల్పడింది ఎవరు? ఎందుకు కాల్పులకు తెగించాడు? గాయపడింది ఎవరు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన పూర్వాపరాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.