: ఐదు విమానాశ్రయాల సిబ్బందిని పరుగులు పెట్టించిన మహిళ పంపిన ఈమెయిల్!

ఒక మహిళ పెట్టిన ఈమెయిల్ ముంబై, చెన్నయ్, హైదరాబాదు, బెంగళూరు, విశాఖ విమానాశ్రయాల అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ముంబై విమానాశ్రయాధికారులకు ఒక మహిళ నుంచి ఈమెయిల్ వచ్చింది. అందులో...‘‘ఆరుగురు వ్యక్తులు హైజాక్‌ గురించి మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. మొత్తం 23 మందిమీ విడిపోయి, ముంబై, హైదరాబాద్‌, చెన్నైల్లో వేర్వేరుగా విమానాలెక్కి వాటిని హైజాక్‌ చేయాలి.. అన్నది వారి మాటల సారాంశం. ఈ మాటలు నిజమో కాదో నాకు తెలియదు. ఓ బాధ్యతగల పౌరురాలిగా పోలీసులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మెయిల్‌ పెడుతున్నా’’ అని పేర్కొంది. అంతే, వెంటనే ఈ మూడు విమానాశ్రయాల్లో భద్రత పెరిగింది. కమెండో బృందాలు, పేలుడు పదార్థాలను గుర్తించగల జాగిలాల బృందాలు రంగంలోకి దిగాయి.

వీటితో పాటు బెంగళూరు, విశాఖపట్టణం విమానాశ్రయాల్లో భద్రతను మరింత పెంచారు. వైజాగ్ నుంచి ఈ మూడు విమానాశ్రయాలకు భారీ ఎత్తున ప్రయాణికులు చేరుకుంటారు. ఈ మధ్య కాలంలో భత్కల్ సోదరుల ఘటన అనంతరం ఉగ్రవాదం లింకులు కర్ణాటకలో తేలుతుండడం కారణంగా కూడా ఈ రెండు విమానాశ్రయాల్లో భద్రతాదళాలు ఆమూలాగ్రం తనిఖీ చేశాయి. ఎలాంటి అనుమానాస్పద అంశమూ కనిపించకపోవడంతో, వచ్చిన మెయిల్‌ నిజమైనది కాకపోవచ్చని, అయినా సరే ప్రయాణికుల భద్రత విషయంలో రిస్క్ చేయలేమని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News