: ఇదో గుండాగిరి... అంతే!: కలకలం రేపుతున్న సోనూ నిగమ్ ట్వీట్లు


ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చేసిన ట్వీట్లు పెనుదుమారం రేపాయి. ఉదయాన్నే తనకు నిద్రాభంగం కావడంతో మతం పేరిట అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ముంబైలోని సోనూ నిగమ్ ఇంటికి సమీపంలో ఒక మసీదు ఉంది. ఈ మసీదు నుంచి రోజూ ఐదుసార్లు ఆజాన్ (ప్రార్థన) మైకు ద్వారా వినిపిస్తుంది. దీంతో తెల్లవారు జామున సోనూ నిగమ్ కు నిద్రాభంగమైంది.

దీంతో సోనూ నిగమ్ ట్విట్టర్ లో ‘అందరినీ దేవుడు చల్లగా చూడాలి. నేను ముస్లింని కాను. అయినా ఉదయాన్నే వినిపించే ఆజాన్‌ పిలుపుతో నిద్రలేవాలి. భారతదేశంలో ఈ బలవంతపు మతతత్వం ఎప్పుడు ముగుస్తుందో. అయినా మహమ్మద్‌ ప్రవక్త ఉన్న సమయంలో ఇలా ఆజాన్‌ పిలుపునివ్వడానికి అప్పట్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. ఎడిసన్‌ బల్బు కనిపెట్టిన తర్వాతే ఈ ధ్వని గోలేంటి? నిజంగా చెప్పాలంటే మతాన్ని అనుసరించని వారికి ఉదయాన్నే ధ్వనులతో నిద్రలేపే ఆలయాలు, గురుద్వారాలను నేను నమ్మను. ఇదో గూండాగిరి అంతే.’ అంటూ ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లు పెనువివాదానికి కారణమయ్యాయి. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ నెటిజన్లు సోనూ నిగమ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.











  • Loading...

More Telugu News