: యూపీలో కీలక పరిణామం... బీజేపీలో చేరనున్న రాజా భయ్యా!


రాష్ట్రమంతా బీజేపీ హవా నడుస్తున్న వేళ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష ఓట్లకు పైగా బంపర్ మెజారిటీతో కుండా నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నేడు రాజా భయ్యా, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుని చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జానకీ శరణ్ పై ఘన విజయం సాధించారు. రాజా భయ్యా చేరిక కుండా ప్రాంతంలో బీజేపీని మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News