: నియంత పాలనకు అద్దం పడుతున్న తెలంగాణ: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం నియంత పాలనకు అద్దం పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, అంజన్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్ రెడ్డి, తదితరులను అరెస్టు చేసి నారాయణ గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కుటుంబ పాలన, నియంత పాలన తప్ప ప్రజాపాలన లేదని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు.