: హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాట పోస్టర్లు!


తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఓపక్క రజనీ రాజకీయ ప్రవేశంపై ఊగిసలాట కొనసాగుతుండగా, మరోపక్క తమిళ హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ మధురైకి చెందిన అభిమానులు రాష్ట్రంలో పోస్టర్లను అంటించారు. దీంతో, ఈ పోస్టర్ల వ్యవహారంపై  రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

కాగా, మే 1న హీరో అజిత్ తన 46వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజైన్ చేసిన పోస్టర్లు, బ్యానర్లను నిన్న విడుదల చేశారు. అజిత్ తన పుట్టిన రోజు నాడు రాజకీయ ప్రవేశంపై ఓ ప్రకటన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే, తమ అభిలాషను ఈ పోస్టర్ల ద్వారా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News