: హైదరాబాద్ బయలుదేరిన మంత్రి దేవినేని ఉమ
టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం 5 గంటలకు హఠాన్మరణం చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏపీ మంత్రి దేవినేని ఉమ కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ బయలుదేరారు. నెహ్రూ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాదుకు వస్తున్నట్టు సమాచారం. కాగా, తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించిన దేవినేని నెహ్రూ, ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. విజయవాడలోని కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, తూర్పు నియోజకవర్గం నుంచి ఓ సారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెహ్రూకు కొడుకు, కూతురు ఉన్నారు.