: పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటేనే పెట్టుబడులు, ఆదాయం వస్తాయి: కళా వెంకట్రావు

చిన్నా, పెద్ద తేడా లేకుండా పరిశ్రమలకు త్వరితగతిన విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ఏపీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటేనే పెట్టుబడులు, ఆదాయం వస్తాయని అన్నారు. ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, 3 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. ఈ నెల 27, 28 న విశాఖపట్టణంలో విద్యుత్ మంత్రులు, అధికారుల సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News