: మూడున్నర దశాబ్దాల చిరకాల మిత్రులతో చంద్రబాబుకు చిక్కులు!
చంద్రబాబునాయుడు... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ, ఓ 30 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా నుంచి యువనేతగా రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయనకు అత్యంత ఆప్తమిత్రులుగా, ఉండి, ఆయనతో పాటే రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చిన ఓ ముగ్గురు నేతలతో ఇప్పుడు చంద్రబాబుకు చిక్కులు వచ్చి పడ్డాయి. అంగరంగ వైభవంగా సాగుతూ వచ్చిన వీరి స్నేహం, కాలంతో పాటు మారిపోయి అనుకోని మలుపులు తిరిగింది. ఇప్పుడిక వీరిని కలుపుకుపోయి, అందరినీ ఓ గాటన పెట్టేందుకు చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నయానో, భయానో వారిని బుజ్జగించాలని చూస్తున్నారు.
ఇక అసలు విషయానికి వెళితే, చంద్రబాబునాయుడికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శివప్రసాద్, గాలి ముద్దుకృష్ణమనాయుడులతో ఉన్నది ఈ నాటి స్నేహం కాదు. వారిది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా వీరి మధ్య స్నేహం మాత్రం చెడలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నిజం చెప్పాలంటే, మిగతా ముగ్గురూ చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను ఉద్దేశించి ఆవేశపడుతున్నారు. అనారోగ్యం పేరు చెప్పి తనను పట్టించుకోవడం లేదని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంతో సీనియర్ ను అయిన తనకు తగిన బాధ్యతలు అప్పగించడం లేదని గాలి ముద్దు కృష్ణమనాయుడు బహిరంగ వ్యాఖ్యలు చేయగా, తాజాగా, శివప్రసాద్ సైతం ఇదే దారిలో నడిచారు. ఇప్పుడిక తన మిత్రులను చంద్రబాబు ఎలా దారికి తెచ్చుకుంటారో వేచి చూడాలి.