: జనసేన ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం... నెలాఖరు వరకు ప్రభుత్వానికి గడువు!

 జనసేన పార్టీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు బాధితులు తమ సమస్యలను వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పించడం బాధతులను ఆవేదనకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం బాధితులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. న్యాయస్థానం బాధితులకు అండగా నిలుస్తున్నా, ప్రభుత్వం అండగా నిలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News