: రోజు కూలీ 7 లక్షలా?... రేపు కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మిన చోటే మేమూ ఐస్ క్రీమ్ అమ్ముతాం: దానం నాగేందర్
తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రోజు కూలీ 7 లక్షలా? అని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నెల రోజులు కష్టపడి పని చేస్తే 20 వేల రూపాయలు సంపాదించడమే కష్టమైపోతుంటే... మంత్రి కేటీఆర్ రోజు కూలీ 7 లక్షల రూపాయలు సంపాదించడం సాధారణ విషయం కాదని అన్నారు.
టీఆర్ఎస్ కూలీలు ఎంత డ్రామా ఆడుతున్నారో ఈ ఘటన చూస్తే తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఐస్ క్రీములమ్మిన చోటే తాము కూడా రేపు ఐస్ క్రీములు అమ్ముతామని, అదే కూలి రాని పక్షంలో అక్కడే బైఠాయిస్తామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారో తమ దగ్గర లిస్ట్ ఉందని ఆయన తెలిపారు. దీనిపై సోమవారం ట్యాంక్ బండ్ పై ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించారు.