: నేను పోటీ చేసేందుకు చాలా పార్టీలు వున్నాయి: స్వరం పెంచిన శివప్రసాద్... చంద్రబాబుకు ఘాటు సమాధానాలు!
టీడీపీ ఎంపీ శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ జయంతి సందర్భంగా శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హథీరాంబాబా ఆస్తులను కొట్టేసేందుకే ఆ ఆరోపణలు చేశానంటూ చంద్రబాబు అంతటి వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమని శివప్రసాద్ అన్నారు. 2003లో కౌలుదారులకు యాజమాన్య హక్కులు ఇవ్వాలంటూ జీవో తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన తెలిపారు. ఆయన ఇచ్చిన జీవో ప్రకారమే తాను సిఫారసు చేశానని ఆయన చెప్పారు. అది తనకు వచ్చే భూమి కాదని, దళితులకు ఉపయోగపడేదని ఆయన అన్నారు.
తనను దెబ్బ కొట్టడానికి వేరే ఏదీ దొరకలేదని, అందుకే తానేదో కబ్జా చేశానన్న రీతిలో ఆ ఫైల్ ను ఒక మీడియా సంస్థకు ఇచ్చారని ఆయన తెలిపారు. 'ఒక దళితుడ్ని ట్రాన్స్ ఫర్ చేయండి అని అడగడం తప్పా? లేకపోతే ఏ రాజకీయనాయకుడు అలాంటి సిఫారసులు చేయడం లేదా?' అని ఆయన ప్రశ్నించారు. తాను కేవలం కుప్పం ఓట్లతో మాత్రమే గెలవలేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తల ఓట్లతో గెలిచానని అన్నారు. అలాగే తనకు కేవలం దళితులే ఓట్లు వేయలేదని, తన భార్య రెడ్డి కులానికి చెందినదని, ఆమె సామాజిక వర్గం కూడా తన గెలుపులో భాగమైందని ఆయన చెప్పారు.
తనను అభిమానించేవారు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. 2019 నాటికి కేవలం టీడీపీ మాత్రమే కాదని, పోటీ చేసేందుకు తనకు చాలా పార్టీలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆమధ్య తాను కిందపడ్డప్పుడు చంద్రబాబు చూసి, తనను దాటుకుని వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఆ రోజు కనీసం దెబ్బేమైనా తగిలిందా? అని చంద్రబాబు అడుగుతారని చూశానని, ఆయన కనీసం పట్టించుకోలేదని, దానికి బాగా హర్ట్ అయ్యానని ఆయన తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీని వదిలేస్తే...ఓట్లెలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అదే తాను అడిగితే చెడ్డ అయిపోయానని ఆయన తెలిపారు.