: స్వాతికి మరో మూడు రోజుల పాటు ఐసీయూలోనే చికిత్స
అమెరికాలో చనిపోయిన టెక్కీ మధుకర్ భార్య స్వాతి హార్పిక్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందించనున్నారు. హార్పిక్ లోని రసాయనాల వల్ల పేగులు దెబ్బతిన్నాయని... ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు మూడు నెలలైనా పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, స్వాతి తొందరగా కోలుకోవాలని బంధువులు ఆకాంక్షిస్తున్నారు.