: బీజేపీలోకి వెళ్తున్నాననే ప్రచారం వెనుక కుట్ర ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
తాను, తన సోదరుడు వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని... బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నామంటూ గతంలో కూడా తమపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఇలాంటి ప్రచారం వెనుక తమను రాజకీయంగా దెబ్బతీయాలనే కోణం దాగుందని ఆయన అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై విశ్వాసంతో తాము పని చేస్తామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాము కాంగ్రెస్ ను వీడమని అన్నారు. టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ పార్టీలో తామంటే గిట్టని వారే ఈ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.