: పాక్ 800 కి.మీ దూరంలోనే ఉంది.. బాంబు వేయండి.. కుల్ భూషణ్ ను తీసుకురండి: ప్రవీణ్ తొగాడియా
భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్షను విధించడం, దీనిపై భారత్ చేస్తోన్న విన్నతులను తోసిపుచ్చడం పట్ల విశ్వ హిందూ పరిషత్ కార్య నిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌కు 10 వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఆప్ఘనిస్థాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా బాంబు వేసిందని, భారత సర్కారు కూడా పాకిస్థాన్‌పై బాంబు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన అన్నారు. న్యూఢిల్లీకి పాక్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దానితో పాటు భద్రత దళాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులను హతమార్చాలని అన్నారు. పాకిస్థాన్‌పై భారత్ బాంబు వేసి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని ఆయన వ్యాఖ్యానించారు.