: చిరంజీవిగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: హీరో నాని సంతోషం
మెగాస్టార్ చిరంజీవి తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని హీరో నాని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇంతకీ, చిరంజీవి ఇచ్చిన మాట ఏంటంటే.. చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షో కు నాని ముఖ్యఅతిథిగా ఇటీవల వెళ్లాడు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాలను నాని ప్రస్తావించాడు. గతంలో విడుదలైన చిరంజీవి ‘మాస్టర్’ సినిమాకు తాను సైకిల్ పై వెళ్లానని, టిక్కెట్ దొరికిన ఆనందంలో తన సైకిల్ పోయిన విషయాన్ని కూడా పట్టించుకోలేదని, దాని కోసం బాధ పడలేదని ఆ షోలో చెప్పాడు.
అయితే, ఆ షో లో గెలుచుకున్న డబ్బుతో ఓ కొత్త సైకిల్ కొనుక్కుంటానని నాని అనగా, అందుకు, చిరంజీవి అభ్యంతరం చెప్పారు. తన సినిమా చూసేందుకు వెళితే సైకిల్ పోయింది కనుక, మరో కొత్త సైకిల్ ను తానే కొనిస్తానని నాటి షో లో చిరంజీవి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో నానికి కొత్త సైకిల్ ను ఆయన పంపారు. ఆ సైకిల్ పక్కనే నిలబడి ఫొటో దిగిన నాని, దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆ అబ్బాయి సైకిల్ తిరిగి పొందాడు. షోలో ప్రామిస్ చేసినట్టుగా, చిరంజీవిగారు నాకు ఈ సూపర్ కూల్ సైకిల్ ను పంపారు’ అని నాని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

And the boy got his cycle back :)
As promised on the show, Chiranjeevi Garu sent me this super cool cycle!#MegastarForAReason pic.twitter.com/zMrbDLMwGj
— Nani (@NameisNani) April 14, 2017