: మా దేశం మీ ప్రయోగ కేంద్రమా? : అమెరికాపై అఫ్ఘాన్ మాజీ అధ్య‌క్షుడి మండిపాటు


ఆఫ్ఘనిస్థాన్ లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్ర‌వాదుల‌పై అమెరికా వేసిన అతి పెద్ద న్యూక్లియ‌ర్ ర‌హిత ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్‌’పై ఆ దేశ‌ మాజీ అధ్య‌క్షుడు హమీద్‌ కర్జాయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ‌డానికి కార‌ణం వాళ్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలను పరీక్షించుకోవ‌డమేన‌ని, తమ దేశాన్ని ప్రయోగశాలలా వాడుకుంటున్నారని ఆయ‌న మండిపడ్డారు. అంతేగాని ఉగ్రవాదులను అంతం చేయ‌డానికి కాద‌ని వ్యాఖ్యానించారు. ఇది ఎంతో అమానవీయమైనదని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని ఇలాంటి ప్ర‌యోగాల‌కు ఉప‌యోగించుకోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు.





  • Loading...

More Telugu News