: హేమమాలిని రోజూ మద్యం తాగుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే బచ్చుకదు సంచలన వ్యాఖ్యలు
కేవలం మద్యం తాగుడుకు అలవాటు పడటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వాలు వ్యాఖ్యానించడం సరికాదని మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చుకదు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది రోజూ మందు కొట్టేవారేనని, పాత్రికేయుల్లో అత్యధికులు మద్యం సేవిస్తారని తెలిపిన ఆయన, అంతెందుకు, నటి హేమమాలిని రోజూ మద్యం తాగుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? అని బచ్చుకదు ప్రశ్నించారు. మహారాష్ట్రలో మద్యం దుకాణాలపై ఆంక్షలు సరికాదని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటే చాలని అన్నారు.