: హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టెక్కీ మధుకర్ రెడ్డి భార్య స్వాతి

ఇటీవల అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన టెక్కీ మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను కడసారి చూసేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో తనపై అభాండాలు వేస్తున్నారని ఆరోపించిన స్వాతి, టాయిలెట్ క్లీనర్ 'హార్పిక్' తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను హైదరాబాద్, కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. స్వాతి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, తనకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News