: అట్లాంటా రైల్వే స్టేషన్ లో దుండగుడి కాల్పులు
జార్జియా రాజధాని అట్లాంటాలోని రైల్వేస్టేషన్ లో చోటుచేసుకున్న కాల్పులు కలకలం రేపాయి. అట్లాంటాలోని వెస్ట్ లేక్ రైల్వే స్టేషన్ లో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స నందిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. అయితే ఇది ఉగ్రదాడా? లేక మరేదైననా? అన్నది తెలియాల్సి ఉంది.