: అమెరికా వేసిన బాంబు పేరు 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'


ఆఫ్ఘనిస్థాన్ లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్ర‌వాదుల‌పై అమెరికా వేసిన బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా వ్యవహరిస్తారని అమెరికా తెలిపింది. టెక్నిక‌ల్‌ గా దీనిని జీబీయూ-43-బీ బాంబ్ అంటారని అధికారులు తెలిపారు. దీనినే మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్‌ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబీ) అని కూడా అంటారని అమెరికా రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. ఇంత పెద్ద భారీ బాంబును ఉగ్రవాదులపై అమెరికా వాడ‌డం ఇదే తొలిసారని తెలుస్తోంది.

ఆఫ్ఘ‌నిస్తాన్‌ లోని నాన్‌ గ‌ర్‌ హ‌ర్ ప్రావిన్స్‌ లోని గుహలు, సొరంగాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ ఎత్తున తలదాచుకున్నారని తెలియడంతో 21,600 పౌండ్ల బరువైన 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'ను విమానం నుంచి జార‌విడిచారు. ఈ ఉగ్రదాడికి కారణం ఏంటంటే... గ‌త వారం నాన్‌ గ‌ర్‌ హ‌ర్ ప్రావిన్స్‌ లో అమెరికా ప్ర‌త్యేక ద‌ళానికి చెందిన ఒక జ‌వానును ఇస్లామిక్ ఉగ్ర‌వాదులు అత్యంత దారుణంగా హతమార్చారు. దీనికి ప్రతీకారంగా ఈ బాంబుతో అమెరికా విరుచుకుపడింది. 9 మీట‌ర్ల పొడవుండే ఈ బాంబును జీపీఎస్ గైడెన్స్ ద్వారా పేల్చగలగడం విశేషం.


  • Loading...

More Telugu News