: నేడు హైదరాబాదులో బీజేపీ కోర్ కమిటీ సమావేశం... ముస్లిం రిజర్వేషన్లు అడ్డుకోవడం ఎలా?


నేడు హైదరాబాదులో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమలు చేస్తామంటున్న ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడం ఎలా? అన్న దానిపై సమాలోచనలు చేయనున్నారు. మతపరమైన రిజర్వేషన్లు దేశానికి మంచిది కాదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వాదిస్తోంది. ఇలాంటి విధానాలు తిరోగమనానికి సూచికలని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

  • Loading...

More Telugu News