: అప్పుడు, ‘సినిమా టికెట్’ ఇవ్వమన్నాను: సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ, తాను చాలా బిడియస్థుడినని, తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న అభిమానుల కోసం తన జీవితంలోని ముఖ్య విశేషాలను వారితో ఎలా పంచుకోవాలో నేర్చుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను సచిన్ ప్రస్తావించాడు. ‘బహుశ అప్పుడు, నాకు నాలుగేళ్లు అనుకుంటా.. మేమంతా కలిసి ‘మా’ సినిమా చూసేందుకని బస్సులో వెళ్తున్నాము. కండక్టర్ వచ్చి ఏ స్టేషన్ కు టిక్కెట్ కావాలని అడిగేందుకు బదులు, ‘ఏ టిక్కెట్ కావాలి?’ అని అడిగారు. అప్పుడు, నేను ‘మా’ సినిమాకు టిక్కెట్ ఇవ్వమని అడిగాను’ అని సచిన్ చెప్పడంతో అంతా నవ్వేశారు.