: ఏడాదికో కొత్త మొబైల్‌ కొనుక్కుంటున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు!

నేటికాలంలో స్మార్ట్‌ఫోన్‌ల‌కి ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. మొబైల్ లేకుండా ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌లేని వారు ఎంద‌రో ఉన్నారు. అత్యంత వేగంతో మొబైల్ లో ఇంట‌ర్నెట్ సేవ‌లు అందుతుండ‌డం, అర‌చేతిలోనే ప్ర‌పంచ వ్యాప్త స‌మాచారం తెలుసుకునే వీలుండ‌డంతో మొబైల్ ఫోన్‌ల ప‌ట్ల అమితంగా ఆక‌ర్షితులమ‌వుతున్నాం. ఈ క్ర‌మంలో మొబైల్ త‌యారీ కంపెనీలు పోటీప‌డి మ‌రీ ఒక‌దాన్ని మించిన ఫీచ‌ర్ల‌తో మ‌రొక‌టి కొత్త మొబైళ్ల‌ను తీసుకొస్తున్నాయి. 'పాత ఒక రోత.. కొత్త ఒక వింత' అన్న చందంగా మొబైల్ యూజ‌ర్లు త‌మ వ‌ద్ద ఉన్న పాత ఫోన్లకు గుడ్ బై చెప్పేసి మార్కెట్లో వ‌స్తోన్న కొత్త‌ మొబైల్ వెంట ప‌డుతున్నారు. దీంతో దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఏడాదికి కొత్త మొబైల్‌కి మారిపోతున్నార‌ని ఓ స‌ర్వే ద్వారా తెలిసింది.

1500 మంది వినియోగ‌దారుల‌తో మాట్లాడి ఈ స‌ర్వే చేసిన ప్ర‌తినిధులు పలు విష‌యాల‌ను వెల్ల‌డించారు. మొబైల్ యూజర్లలో చాలా మంది 4జీ వీవోఎల్‌టీఈ (వోల్ట్‌) స‌దుపాయం, అధిక మెమొరీ, బ్యాటరీ సామర్థ్యం, ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్‌, సెల్ఫీ తీసుకోవ‌డానికి అనువైన ఫ్రంట్‌ కెమెరా సౌకర్యం ఉన్న ఫోన్లపై ఆస‌క్తి చూపుతున్నారని తెలిపారు. కొత్త మొబైళ్లపై విశ్లేష‌కులు చేసే
సమీక్షలను దృష్టిలో ఉంచుకుని క‌స్ట‌మ‌ర్లు మొబైళ్ల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని తెలిసింది.

More Telugu News