: కోటిన్నర కట్నంతో ఆరుగురు కుమార్తెలకు పెళ్లి చేసి ఇరకాటంలో పడ్డ చాయ్ వాలా!
ఆరుగురు కుమార్తెలకు ఘనంగా వివాహం నిర్వహించిన లీలా రామ్ గుజ్జర్ అనే ఛాయ్ వాలా చిక్కుల్లో పడ్డ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని కొత్పుట్లీ సమీపంలోని హదుటా వద్ద లీలా రామ్ గుజ్జర్ టీ స్టాల్ నడుపుతున్నాడు. అతను ఏప్రిల్ 4న తన ఆరుగురు కుమార్తెలకు ఘనంగా వివాహం చేశాడు. స్థానిక ప్రజలు, కమ్యూనిటీ నేతలు చూస్తుండగా ఆరుగురు అల్లుళ్లకు సుమారు కోటిన్నర రూపాయల కట్నం అందజేశాడు.
ఈ విషయం తెలుసుకున్న ఐటీ శాఖ అతనికి నోటీసులు పంపింది. ఆ డబ్బుకు లెక్క చెప్పాలని సూచించింది. గురువారం వరకు ఆగుతామని, ఆయన రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే, ఆదాయార్జనపైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. అంతే కాకుండా ఆయన అల్లుళ్లకు ఇచ్చిన డబ్బును లెక్కలో చూపని నగదుగా గుర్తిస్తే, తరువాత ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు.
ఇకపోతే ఆయనను ఇంకో వివాదం కూడా ఇబ్బందుల్లో పడేస్తోంది. వివాహం ఆహ్వాన పత్రికలో కేవలం ఇద్దరు కుమార్తెల వివాహాన్ని మాత్రమే పేర్కొన్న లీలా రామ్... అదే సమయంలో తన నలుగురు మైనర్ కూతుర్లకు కూడా పెళ్లి చేయడం విశేషం. ఐటీ నోటీసులు అందజేసేందుకు ఆయన ఇంటికి వెళ్లగా, అక్కడ ఎవరూ లేరని కొత్పుట్లీ పోలీసులు తెలిపారు.